23-12-2025 08:10:38 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయ క్రాంతి): విద్యార్థులు పోటీ తత్వంతో ముందుకు వెళ్లాలని మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సుకన్య అన్నారు. మంగళవారం జిల్లా మహిళా సాధికారత ఆధ్వర్యంలో భేటీ బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా వీర్ బాల్ దివాస్ ను పురస్కరించుకొని విద్యార్థినిలకు వ్యాసరచన, ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీలలో అత్యంత ప్రతిభ కనబరిచిన వారికి ఈనెల 30న జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో బహుమతులు అందజేయడం జరుగుతుందని నిర్వాహకులు రాణి ,రాజేశ్వరి తెలిపారు.ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ఉపాధ్యాయురాలు, విద్యార్థినిలు పాల్గొన్నారు.