calender_icon.png 6 September, 2025 | 5:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా కోసం రైతుల ఇబ్బందులు

06-09-2025 12:37:29 AM

రాష్ట్రంలో మహిళలు కొట్టుకునే దుస్థితి

జగిత్యాల అర్బన్, సెప్టెంబర్ 5(విజయ క్రాంతి): యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. శుక్రవారం జగిత్యాల బిఆర్‌ఎస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంతతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని.. కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో రైతులకు సకాలంలో ఎరువులు అందించామన్నారు. బిజెపి, కాంగ్రెస్ లు యూరియ విషయంలో డ్రామాలు ఆడుతూ రైతులను అదొగతి పాలు చేస్తున్నారని మండిపడ్డారు. యూరియ లేకపోవడం వల్ల పొలాలు ఎర్రబడుతున్నాయని, దిగుబడి తగ్గడం, చీడ పీడల వల్ల నష్టపోతామని ఓవైపు రైతుల గగ్గోలు పెడితే యూరియ కొరత లేదని, కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ముఖ్యమంత్రి చెప్పడం హాస్యాస్పదమన్నారు.

ఇటీవల మహబూబాబాద్ లో మహిళ లు యూరియ విషయంలో కొట్టుకోవడం కూడా చూసామన్నారు. కేంద్రం 8లక్షల 32 వేల మెట్రిక్ టన్నుల యూరియ కేటాయిస్తే 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియ కేటాయించడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతుంటే జిల్లాకు చెందిన మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

ఎమ్మెల్సీ కవిత విషయంలో విలేఖరులు అడిగిన ప్రశ్నలకు వారు సమాధానమిస్తూకవిత ను ఆడబిడ్డ గా గౌరవిస్తామని, కాళేశ్వరం విషయంలో హరీష్ రావు ఫై చేసిన ఆరోపణలు పూర్తిగా సత్య దూరమని అన్నారు. కేసీఆర్ అంటేనే బి ఆర్ యస్ పార్టీ అని.. కేసీఆర్ ని కాదనుకొని వెళ్లిన వారి పరిస్థితి ఎలా ఉందొ అందరికి తెలుసని చెప్పారు.

ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్లు దేవేందర్ నాయక్, సమిండ్ల వాణి శ్రీనివాస్,అవారి శివాకేసరి బాబు, ప్యాక్స్ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, జగిత్యాల రూరల్, అర్బన్ అధ్యక్షులు ఆయిల్నేని ఆనంద్ రావు, తుమ్మ గంగాధర్, నీలి ప్రతాప్,కోటగిరి మోహన్,దావ సురేష్, జవ్వాజి ఆది రెడ్డి, హరీష్ కల్లూరి,చందా సాయి తదితరులుపాల్గొన్నారు.