06-09-2025 12:37:43 AM
-సుప్రీంకోర్టు తీర్పుతో నష్టపోతున్నాం
-మంత్రి సీతక్కకు నీట్ క్వాలిఫైడ్ విద్యార్థుల వినతి
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి) : నీట్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించినా సుప్రీంకోర్టు తీర్పు కారణంగా కౌన్సిలింగ్‌కు హాజరు కాలేకపోతున్నామని విద్యార్థు లు ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ క్వాలిఫైడ్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు శుక్రవారం ప్రజాభవన్‌లో మంత్రి సీతక్కను కలిశారు.
తెలంగాణ బిడ్డలమైనప్పటికీ కేవలం ఇంటర్మీడియట్ పొరుగు రాష్ట్రాల్లో చదవడం వల్ల తాము నష్టపోతు న్నామని మంత్రి సీతక్క దృష్టికి విద్యార్థులు తీసుకువచ్చారు. మీ సమస్యను సంబంధిత శాఖ మంత్రి, సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.