7 August, 2026 | 3:16 AM

సమస్యలు తొలగేనా.. నాట్లు పడేనా..!

07-08-2026 01:59 AM

అప్రకటిత విద్యుత్ కోతలతో అవస్థలు పడుతున్న రైతన్నలు 

సాగుకు పట్టుమని 8 గంటలు రాని వైనం

పాలక వీడు మండలంలో వేధిస్తున్న లైన్ సమస్యలు...

కాలిపోతున్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు..

సమస్యలు పట్టించుకోని విద్యుత్ అధికారులు 

సబ్ స్టేషన్‌ను ముట్టడించిన అన్నదాతలు 

పాలకవీడు, ఆగష్టు 6: అప్రకటిత విద్యు త్ కోతలతో మండల వ్యాప్తంగా రైతుల ఇబ్బందులు పడుతున్నారు.రైతులకు ఉన్న నీటి వనరులతో వానాకాలం సీజన్ కు వరి ని సాగు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో కరెంటు సరిగ్గా రాక తడిసిన పొలమే మళ్లీ తడిసి ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది.దీంతో రైతన్నల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. వ్యవసాయానికి 14గంటల ఉచిత కరెంట్ సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెపుతున్నా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.

త్రీ ఫేజ్ కరెంట్ సరఫరాలో అధికారులు గంట ల పాటు కోతలు విధిస్తున్నారు.వర్షాల కో సం ఓవైపు రైతులు ఎదురుచూస్తుంటే, కరెం ట్ సరఫరాలో కోతలు అన్నదాతలను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి.పాలకవీడు మండ లంలో రెండు రోజులుగా త్రీఫేజ్ కరెంట్ రా వడం లేదు.దీంతో గురువారం పాలకవీడు సబ్ స్టేషన్ చుట్టు పక్కన గ్రామల రైతులు ముట్టడించి ఆందోళన చేశారు.రెండు రోజులుగా కరెంట్ లేకపోవడంతో నారు మాడు లో నీళ్లు లేక ఎండిపోయో పరిస్థితి ఏర్పడింది. పొలాలు తడవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సకాలంలో స్పదించని లైన్మైన్..

కరెంట్ పోయిన రెండు రోజుల దాక స్పందించని విద్యుత్ అధికారులు లైన్ మైన్ కి రైతులు ఫోన్ చేసి అడిగితే మీరు కరెంట్ పని చేసే వ్యక్తులని తెచ్చుకోండి అని పొం తన లేని సమాధానం చెపుతూ,దూసురుగా మాట్లాడుతున్నారని రైతులు వాపోతున్నారు.

కాలుతున్న ట్రాన్స్ ఫార్మర్లు...

ఎండల ప్రభావం,దీనికి తోడు వర్షాలు లేకపోవడంతో ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతున్నాయి.జూన్,జూలై నెలల్లో 60 రోజుల వ్యవధిలోనే మండల వ్యాప్తంగా దాదాపు 15 నుండి 20 ట్రాన్సాఫార్మర్లు కాలిపోయా యి.వర్షాల్లేక అధికంగా బోర్లు,బావుల నుం చి మోటర్ల వినియోగం పెరిగి లోవోల్టేజీతో ట్రాన్స్ఫార్మర్లు కా లిపోతున్నాయి.ఇటీవల ఎండల ప్రభావం సైతం తీవ్రంగా ఉండటం తో గృహ వినియోగం అదే స్థాయిలో పెరుగుతోంది.వీటన్నింటిని తట్టుకోవాలంటే పు ష్కలమైన కరెంట్ ఉంటేనే సాధ్యమవుతోంది. కానీ, చెప్పేదొకటి.. చేసేదొకటి అన్న ట్లు పరిస్థితులున్నాయి.కాలిన ట్రాన్స్ ఫార్మర్లకు బదులుగా వెంటనే మరో ట్రాన్స్ ఫా ర్మర్ను రైతులకు విద్యుత్ అధికారులు అందించడంలేదు. రైతులకు సమస్యంతా నాణ్యమైన విద్యుత్ సరఫరాలోనే ఎదురవుతోంది.

లైన్ సమస్య ఉంది

లైన్ సమస్య ఉంది.రెండు రోజులుగా బ్రేక్ డౌన్ ఐన ది.లైన్ ప్రా బ్లమ్ సరి చేసి రైతులకు సకాలంలో విద్యుత్ సరఫరా చేస్తాం.రైతులకు విద్యు త్ సరఫరాను అందించేందుకు మా వంతు కృషి చేస్తున్నాం.

పందిరి శ్రీనివాస్, విద్యుత్ ఏఈ, పాలకవీడు