26-07-2025 01:23:12 AM
నిండుకుండలా హుస్సేన్‌సాగర్
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 24 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరాన్ని గత మూడు రోజులుగా ముసురు విడువడం లేదు. బుధవారం రాత్రి నుంచి మొద లైన వర్షం అలాగే కురుస్తుండటంతో నగరం తడిసి ముద్దయింది. చల్లటి గాలులు వీస్తూ, ముసురు కురుస్తుండటంతో రాకపోకలు సాగించేందుకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రద్దీగా ఉండే రోడ్లు, ఐటీ కారిడార్‌లోని దాదాపు అన్ని రోడ్లలో ఎక్కడా కూడా నీరు నిల్వకుండా హైడ్రా టీమ్‌లు నిరంతరం పర్యవేక్షి స్తున్నాయి. ఎక్కడైనా లోతట్టు ప్రాంతాల్లోని మెయిన్ రోడ్లు, జంక్షన్లలో నీరు నిలిస్తే వెంటనే మోటార్లతో తోడేసే విధంగా హైడ్రా ఏర్పాట్లు చేసుకుంది.
గ్రేటర్ హైదరాబాద్ మహానగరానికి మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో, వర్షంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా హైడ్రా, జీహెఎంసీ ముందస్తుగా చర్యలు చేపట్టాయి.
పలు ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం (సెం.మీ.లలో)
సికింద్రాబాద్‌లో 1.27 సెం.మీ.లు, బేగంపేట్ యూసుఫ్‌గూడ చందా నగర్ మూసాపేట్ ముషీరాబాద్ ఖైరతాబాద్ ఉప్పల్ 0.76, జూబ్లీహిల్స్ కూకట్‌పల్లి 0.65, శేర్లింగంపల్లి మల్కాజ్‌గిరి 0.52, సరూర్‌నగర్ సెం.మీ. ల వర్షపాతం నమోదైంది.
సాగర్‌లో పెరిగిన నీటిమట్టం
నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహంతో హుస్సేన్‌సాగర్ నిండుకుండలా మారింది. బంజారాహిల్స్, కూకట్ పల్లి, బుల్కాపూర్ నాలాల నుంచి హుస్సేన్‌సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరు తోంది. దీంతో హుస్సేన్‌సాగర్ నీటిమట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్‌కు చేరువలో ఉంది. హుస్సేన్‌సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 513.19 మీటర్లకు చేరింది.
ప్రస్తుతం హుస్సేన్‌సాగర్‌కు ఎగువ నుంచి 400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, తూముల ద్వారా 776 క్యూసెక్కుల నీటిని ఔట్‌ఫ్లో ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ వరద నీరు అశోక్‌నగర్, దోమలగూడ, అంబర్‌పేట్, గోల్నాక ద్వారా ప్రవహించి మూసీలో కలుస్తుంది.