26-07-2025 01:26:56 AM
-అదుపులోకి తీసుకున్న మియాపూర్ పోలీసులు
- రిమాండ్ విధించిన కోర్టు
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 25 (విజయక్రాంతి): మావోయిస్టు కేంద్ర కమిటీ స భ్యుడు తక్కలపల్లి వాసుదేవరావు అలియా స్ ఆశన్న సతీమణి నార్ల శ్రీవిద్యను మియాపూర్ పోలీసులు గురువారం రాత్రి హఫీ జ్‌పేటలో అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఉదయం ఆమెను రంగారెడ్డి జిల్లా కో ర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో శ్రీవిద్యను సంగారెడ్డి జిల్లాలోని కంది డిస్ట్రిక్ట్ జైలుకు తరలించారు.
మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒ క కేసులో శ్రీవిద్యను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర హత్య కేసు, మాజీ ముఖ్యమంత్రి చం ద్రబాబుపై జరిగిన దాడి ఘటనలతో శ్రీవిద్యకు పరోక్ష సంబంధాలున్నట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ అరెస్ట్ ప్రాధాన్యత సం తరించుకుంది. పోలీసులు ఈ కేసులో మ రింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.