30 August, 2026 | 12:44 PM

రైతు సమస్యలను పరిష్కరించాలి

09-12-2024 06:55 PM

నిర్మల్ (విజయక్రాంతి): రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి రైతులందరికీ సంపూర్ణ రెండు లక్షల రుణమాఫీ ప్రకటించాలని సిపిఎం పార్టీ నాయకులు సోమవారం కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు సురేష్ నూతన కుమార్ మాట్లాడుతూ.. రైతులకు రుణమాఫీ పథకాన్ని ప్రతి కుటుంబానికి వర్తింపజేయాలని వరి ధాన్యం బోనస్ డబ్బులను వెంటనే చెల్లించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు శంభు, ఆనందరావు, పోశెట్టి పాల్గొన్నారు.