అబ్దుల్ కలాం స్ఫూర్తితో రాకెట్ లాంచ్
సిన్స్ మీ ఫౌండేషన్ ప్రతినిధుల వెల్లడి..
ముషీరాబాద్ (విజయక్రాంతి): ఐఐటీ కాన్పూర్ సహకారంతో 2027 అక్టోబర్ 18న అబ్దుల్ కలాం జయంతి సందర్బంగా చెన్నై కోస్టల్ ఏరియాలో డి.ఎస్.ఆర్.ఎస్.ఎల్.వి (డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ శాటిలైట్ లాంచ్ వెహికల్) రాకెట్ లాంచింగ్ చేస్తున్నట్లు సిన్స్ మీ ఫౌండేషన్ విష్ణు, పూజిత, సుస్మిత, గ్రీష్మ, అక్షయ, సుజన తెలిపారు. ఇస్రో, నాసా మాదిరిగా సైంటిస్ట్ నందినారాయణ, అబ్దుల్ కలాం, సర్వేపల్లి రాధాకృష్ణణ్ ల స్ఫూర్తితో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ మేరకు సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్, వీడియో లాంచ్ నిర్వహించారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. సీఈఓ ఫౌండర్ ఇషాన్ దూబే సారధ్యంలో స్టూడెంట్స్ అందరూ కలిసి ఈ ప్రాజెక్ట్ ను విజయవంతం చేసి టీచర్స్ కి గిఫ్ట్ గా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ రాకెట్ టెక్నాలజీపై దేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాల్లోని 2047 స్కూల్స్ నుంచి రిజిస్టర్ ఐన 5 నుంచి 9వ తరగతి విద్యార్థులకు రెండు నెలలు ట్రైనింగ్ ఇస్తామన్నారు. ఈ రాకెట్ 20 నుంచి 30 కిమి పైకి వెళ్లి 10 పీకో శాటిలైట్ గా విడిపోతుందిని తెలిపారు. వాతావరణం, ఉష్ణోగ్రతల మీద పరిశోధన జరుపుతుందన్నారు. ఈ ప్రాజెక్ట్ కు 1.2 నుంచి 1.5 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. 2027లో నిర్వహించే ఈ కార్యక్రమం 1.80 లక్షల విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. సైంటిస్ట్ లు లేకుండా కేవలం విద్యార్థులతోనే స్వయంగా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయబడుతుందన్నారు.






