26-07-2025 12:14:34 AM
చిన్నంబావి: వనపర్తి జిల్లా చిన్నంబావి మండల పరిధిలోని కొప్పునూర్ ప్రాథమిక పాఠశాలను ఎంపీడీఓ రామస్వామి సందర్శించారు. పాఠశాలకు హాజరైన విద్యార్థుల సంఖ్యను అడిగితెలుసుకున్నారు. పాఠశాలలో వసతులపై ఆరా తీశారు.అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు.విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. అనంతరం పాఠశాల,అంగన్వాడీ సిబ్బంది ఎంపీడీఓ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రవి, ప్రజలు పాల్గొన్నారు.