2 April, 2026 | 3:16 AM

ధాన్యాన్ని దళారులకు విక్రయించి రైతులు మోసపోవద్దు

02-04-2026 12:00 AM

ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని మధ్య దళాలకు విక్రయించి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రంలోని విక్రయించి రైతులు ఆర్థిక అభివృద్ధి సాధించాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

బుధవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో బాన్సువాడ సొసైటీ పరిధిలోని కొల్లూరు గ్రామంలో, మైలారం సొసైటీ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో, వర్ని సొసైటీ  పరిధిలోని SN పురం, పాత వర్ని గ్రామాలలో యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.

అనంతరం వర్ని మండల కేంద్రంలో నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనం, సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ చేపట్టారు.ఈసందర్భంగా రైతులను ఉద్దేశించి పోచారం మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందనీ రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆయన తెలిపారు.

రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని,రైతులు తొందరపడి దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాలకు తరలించి గిట్టుబాటు ధర పొందాలనీ ఆయన రైతులకు సూచించారు. ప్రభుత్వo మద్దతు ధర A గ్రేడ్ క్వింటాలుకు రూ 2389/-,B గ్రేడ్ క్వింటాలుకు రూ 2369/-మద్దతు ధర ప్రకటించడం జరిగిందన్నారు.

దేశంలో తెలంగాణ రాష్ట్రం మాత్రమే  రైతుల నుంచి పూర్తిగా ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు.రైస్ మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురిచేయకూడదనీ రైతులు పంపిన ధాన్యాన్ని తూకం చేసి వెంటనే రైస్ మిల్లల్లో నిల్వ చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల గ్రామాల ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.