షార్ట్ సర్క్యూట్ - మొక్కజొన్న పంట దగ్ధం
02-04-2026 12:00 AM
లక్ష్మణచందా, ఏప్రిల్ 1 (విజయక్రాంతి.): ఆరుగలం కష్టపడి పండించిన మొక్కజొన్న షార్ట్ సర్కులతో దగ్ధం కావడంతో రైతుకు తీవ్ర నష్టం కలిగింది. రైతు తెలిపిన వివరాల ప్రకారం మునుపెల్లి గ్రామానికి చెందిన ఐలాండ్ లావణ్య అనే రైతు మొక్కజొన్న కోసి పంట చేల్లో ఎండబెడుతుంది. బుధవారం విద్యుత్ తీగల వల్ల షార్ట్ సర్క్యూట్ ఏర్పడి నిప్పు మొక్కజొన్న పంటపై పడడంతో ఒక్కసారిగా మంటలు చేరేగాయి దీని ఆర్పేందుకు రైతులు ప్రయత్నించిన మంట లు ఆరలేదు. రెండు ఎకరాల పంట నష్టపోయారని 50000 వరకు నష్టం వాటిల్లినట్టు రైతు ఆవేదన వ్యక్తం చేశారు .




