దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు
24-04-2026 12:35 AM
కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): దాన్యం అమ్మకాల్లో రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. గురువారం జిల్లాలోని మునగాల మండలం బరాఖత్ గూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులను పలు విషయాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి మద్దతు ధర తోపాటు రూ.500 బోనస్ ఇస్తుందన్నారు. తేమ శాతం, మట్టి గడ్డలు లేకుండా నాణ్యమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ఈయన వెంట పలువురు రైతులు ఉన్నారు.






