calender_icon.png 1 November, 2025 | 10:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు దళారులను ఆశ్రయించొద్దు

01-11-2025 12:29:15 AM

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ 

శివంపేట, అక్టోబర్ 31 :శివంపేట మండల కేంద్రంలోని ప్యాక్స్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, ధాన్యాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎట్టిపరిస్థితుల్లో కూడా ఏ ఒక్క రైతు నష్ట పోకుండా దళారులను ఆశ్రయించకుండా చూడాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలన్నారు.

కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని అన్నారు. రైతులు తెచ్చిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేసి రైతులకు సకాలంలో చెల్లింపులు అందేలా చూడాలని సంబంధిత అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ మైపాల్ రెడ్డి, తహసీల్దార్ కమలాద్రి, పీఏసీఎస్ సీఈవో మధు యాదవ్, మెదక్ జిల్లా రైతు రక్షణ సమితి గౌరవ అధ్యక్షులు అక్కమోళ్ల మైసయ్య యాదవ్, రైతులు పాల్గొన్నారు.