01-11-2025 10:23:27 PM
చార్మింగ్ స్టార్ శర్వా స్పోర్ట్స్, ఫ్యామిలీ డ్రామా బైకర్ షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. అభిలాష్‌రెడ్డి కంకర దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మించింది. మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అతుల్ కులకర్ణి, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. శర్వానంద్ ఈ పాత్ర కోసం కంప్లీట్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. లీన్, అథ్లెటిక్ లుక్‌తో ఆ పాత్రకు అవసరమైన డిటర్మిన్డ్ పర్సనాలిటీని అద్భుతంగా చూపించారు. ఇటీవలే శర్వా స్పోర్ట్స్ గేర్‌తో బైకర్ అవతార్‌లో ఉన్నట్లు చూపించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. శర్వా జిమ్ స్టిల్స్ కూడా వైరల్ అయ్యాయి. తాజాగా మేకర్స్ సినిమా ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్‌ను లాంచ్ చేశారు.
‘ఇక్కడ ప్రతి బైకర్‌కి ఒక కథ ఉంటుంది. సమయంతో పోరాడే కథ. చావుకి ఎదురెళ్లే కథ. ఏం జరిగినా పట్టువదలని మొండివాళ్ల కథ’ అనే పవర్ ఫుల్ వాయిస్ ఓవర్‌తో గ్లింప్స్ ప్రారంభమవుతుంది. ఈ లైన్స్.. ప్రమాదాలు, పోరాటాలతో నిండి ఉన్న బైకర్ లైఫ్ స్టుల్‌ను ప్రజెంట్ చేశాయి.
గ్లింప్స్ అద్భుతమైన స్టంట్లతో ఆకట్టుకుంటుంది. ‘ఇక్కడ గెలవడం గొప్పకాదు. చివరిదాక పోరాటం గొప్ప’ అనే లైన్ ఈ సినిమా స్పిరిట్‌ను చూపించింది. దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకర ‘బైకర్’ ఎసెన్స్ ఈ గ్లింప్స్‌లోనే అద్భుతంగా చూపించారు.
హై స్పీడ్ బైక్ రేసింగ్ సన్నివేశాలకు సంబంధించి జే యువరాజ్ క్యాప్చర్ చేసిన విజువల్స్ లైవ్ రేస్ చూస్తున్న ఫీలింగ్ ఇచ్చాయి. జిబ్రాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రష్‌ను మరింతగా పెంచగా, యూవీ క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ ప్రతీ ఫ్రేమ్‌లో కనిపించాయి.
అనిల్ కుమార్ పీ ఎడిటింగ్, రాజీవన్ ప్రొడక్షన్ డిజైన్, ఎన్ సుందీప్ ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్, ఏ పన్నీర్ సెల్వం ఆర్ట్ సూపర్విజన్.. ఇలా మొత్తం టీమ్ టెక్నికల్‌గా అద్భుతమైన వర్క్ ఇచ్చారు. రేసింగ్‌పై ఫోకస్ చేసిన ఈ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ సినిమా డిసెంబర్ 6న చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.