calender_icon.png 2 November, 2025 | 1:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు చొరవ చూపాలి

01-11-2025 10:04:30 PM

చార్మినార్ జోన్ జోనల్ కమిషనర్ ఎస్. శ్రీనివాస్ రెడ్డి..

రాజేంద్రనగర్ (విజయక్రాంతి): సౌత్ (చార్మినార్) జోన్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి, ప్రాజెక్ట్స్ నిర్మాణ పనులను సాధ్యమైనంత శరవేగంగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని జీహెచ్ యం సి చార్మినార్ జోన్ జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జోనల్ కమిషనర్ సాలిపేట శ్రీనివాస్ రెడ్డి శనివారం రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని శాస్త్రిపురం ఆర్ ఓ బీ, బంరుక్ నూ దౌల చెరువు, మైలర్ దేవుపల్లి లోని కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో అధికారులతో సమావేశం నిర్వహించి పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న ప్రాజెక్ట్స్ నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు.

అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. జోన్ పరిధిలోని రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో కొనసాగుతున్న శాస్త్రిపురం ఆర్ఓబి, కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, బంరుఖ్ నూ దౌల చేరువు అభివృద్ధి, ప్రాజెక్ట్స్ నిర్మాణ పనులను పరిశీలించామన్నారు. సాంకేతిక సమస్యలను అధిగమించి సాధ్యమైనంత త్వరలో నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అభివృద్ధి పనుల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ పర్యటనలో రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి, చార్మినార్ జోన్ ప్రాజెక్ట్స్ ఎస్ ఈ శ్రీనివాస్, ఎలక్ట్రికల్ ఈఈ సతీష్ రెడ్డి, రాజేంద్రనగర్ సర్కిల్ ఈఈ నరేందర్ గౌడ్, టౌన్ ప్లానింగ్, స్పోర్ట్స్, పారిశుద్ధ్య విభాగం అధికారులు పాల్గొన్నారు.