01-11-2025 12:28:29 AM
కొత్తపల్లి,(విజయక్రాంతి): ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్ వద్ద ఏర్పాటు చేసిన పతాకాన్ని బుచ్చన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ మాట్లాడుతూ కార్మికులకు అండగా నిలిచేందుకు 1920 సంవత్సరంలో బొంబాయి నగర నడి సముద్రంలో రహస్యంగా పడవలో సమావేశమై ఏఐటియుసి నామకరణం చేసి నేటికీ 106 సంవత్సరాలు అవుతుందని ప్రతి సంవత్సరం ఏఐటియుసి కార్మిక వ్యతిరేక విధానాలపై నిత్యం పోరాడుతుందని ఆయన అన్నారు.
1920 సంవత్సరంలో ఏఐటియుసి ఏర్పడ్డ నాటి నుండి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూనియన్లు పెట్టుకునే హక్కు కావాలని నాటి బ్రిటిష్ ప్రభుత్వం మెడలు వంచి ప్రమాద నష్టపరిహార చట్టం 1923 26 సంవత్సరంలో ట్రేడ్ యూనియన్లు ఏర్పాటు చేసుకునే చట్టం వేతనాల చెల్లింపు చట్టం 1936లో సాధించుకుందని ఆ తర్వాత స్వాతంత్ర భారత దేశంలో పారిశ్రామిక వివాదాల చట్టం కూడా సాధించుకుంన్నా మని, 1947లో పిఎఫ్ చట్టం, 1952లో ప్రయోజన చట్టం, 1961 బోనస్ ల చట్టం, 1965 కాంట్రాక్ట్ కార్మికుల పర్మినెంట్ చట్టం, 1970 భవన నిర్మాణ సంక్షేమ చట్టం, 1996 సంవత్సరం ఉపాధి హామీ చట్టం 2005 వీటితోపాటు 44 కార్మిక చట్టాలను ఏఐటిసి అగ్రభాగా నిలబడి పోరాటాల ఉద్యమాలు చేయడం ద్వారా సాధించుకో గలమని ఆయన తెలిపారు.