01-11-2025 10:11:26 PM
ఎల్లారెడ్డిలో జక్కుల సంతోష్ బాధ్యతలు..
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): బీసీ వర్గాల అభ్యున్నతి, సంక్షేమం కోసం కృషి చేస్తున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో కొత్త ఊపిరి నింపే విధంగా ఇటీవల కీలక నియామకం జరిగింది. జిల్లా అధ్యక్షులు చింతల శంకర్ నేత చేతుల మీదుగా శనివారం ఎల్లారెడ్డి మండల ఇంచార్జిగా జక్కుల సంతోష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చింతల శంకర్ నేత మాట్లాడుతూ బీసీ వర్గాల అభివృద్ధి కోసం గ్రామ స్థాయి నుండి పోరాడే నాయకులు కావాలి. సంతోష్ లాంటి యువ నాయకులు సంఘాన్ని మరింత బలపరుస్తారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జక్కుల సంతోష్ కుమార్ (వెల్లుట్ల) మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రజా సేవకు వేదికగా మార్చుకుంటాను. ఎల్లారెడ్డి మండలంలోని ప్రతి బీసీ కుటుంబానికి ప్రభుత్వ పథకాలు చేరేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ నియామకంతో ఎల్లారెడ్డి మండలంలో బీసీ సంక్షేమ కార్యక్రమాలకు కొత్త దిశ లభించనున్నదనే ఆశాభావం వ్యక్తమవుతోంది.