calender_icon.png 2 November, 2025 | 1:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే రోహిత్ రావు జన్మదినం సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ..

01-11-2025 10:09:17 PM

శివంపేట్ కాంగ్రెస్ యువ నాయకులు కొడకంచి శివప్రసాద్ గౌడ్...

శివ్వంపేట (విజయక్రాంతి): మెదక్ శాసనసభ్యులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన ముఖ్య అనుచరులు, మండల కేంద్రమైన శివ్వంపేటకు చెందిన కొడకంచి శ్రీనివాస్ గౌడ్ తనయుడు కొడకంచి శివప్రసాద్ గౌడ్ శనివారం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా కొడకంచి శ్రీనివాస్ గౌడ్, శివగౌడ్ మాట్లాడుతూ పేదల కష్ట, సుఖాలలో పాలు పంచుకుని, ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు భగవంతుని చల్లనిదీవెనలతో ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనుచరులు చిట్కూల నితిన్ రెడ్డి, శశాంక్ రెడ్డి, ప్రదీప్ గౌడ్, ప్రశాంత్, మింటూ, తేజ, సన్నీ, అమిర్, తదితరులు పాల్గొన్నారు.