calender_icon.png 2 November, 2025 | 12:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు

01-11-2025 08:57:39 PM

హనుమకొండ,(విజయక్రాంతి): రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడుచున్న దొంగను కేయుసి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్దనుండి రూ.ఆరు లక్షల విలువ గల 40 గ్రాముల బంగారు ఆభరణాలు, 50 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.56,400 డబ్బును స్వాధీనం చేసుకున్నారు. కేయూసీ సీఐ ఎస్.రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం... కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి, తేజిగూడ కు చెందిన సెండే అరుణ్ కుమార్ అనే నేరస్తుడు డిగ్రీ వరకు చదివి 2022 సంవత్సరంలో పూర్తి చేసి, తర్వాత ఒక సంవత్సరం ఇంటి వద్దనే ఖాళీగా ఉండి 2024 సంవత్సరంలో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవడానికి హనుమకొండకు వచ్చి, కొద్ది రోజులు రూం కిరాయి తీసుకొని ఉండి,

చదివే క్రమంలో బెట్టింగ్ లకు బానిసై, అప్పులు చేసి అవి ఎలా తీర్చాలో తెలియక దొంగతనాలు చెయ్యడం ప్రారంబించి, గోపాల్ పూర్, భీమారం ఏరియాలలో ఇంటికి తాళం వేసిన ఇళ్ళను గుర్తించి,రాత్రి పూట తాళాలు పగలగొట్టి బంగారు, వెండి ఆభరణాలు, నగదు దొంగతనాలు చేస్తున్నాడని, నిందితుడు సుమారు 10 నేరాలు చేసినానని ఒప్పుకోని ఇట్టి 10 కేసు లలో 1) 40 గ్రాముల గ్రాముల బంగారు అబరణాలు, 50 గ్రాముల వెండి అబరణాలు మరియు నగదు 56,400. రూపాయలు మొత్తం సుమారు రూ.ఆరు లక్షల విలువ గల బంగారు అబరణాలు, వెండి అబరణాలు మరియు నగదు ను రికవరీ చేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా కేయూసీ ఇన్స్పెక్టర్ ఎస్. రవి కుమార్  మట్లాడుతూ ఎవ్వరైనా ఇళ్ళకు తాళాలు వేసి ఊళ్లకు వెళ్ళేటప్పుడు పక్క ఇళ్ళ వారికి గాని, లోకల్ పోలీస్ వారికి గానీ తెలుపాలని, లేదా ఇళ్ళకు సిసి.కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.ఇటీవల కాలం లో వరుస దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాలు విసిరిన ఇట్టి దొంగ ను ఛాలెంజ్ గా తీసుకొని ఇట్టి కేసు లను తొందరగా ఛేదించిన కేయూసి.ఎస్ ఐ లు పి. శ్రీకాంత్, కె. నవీన్ కుమార్ మరియు కేయూసి. క్రైమ్ సిబ్బంది అయిన అహ్మద్ పాషా, రాజ శేఖర్, జితేందర్ లను మరియు వీరికి సహకరించిన సిసిఎస్ వరంగల్ సిబ్బంది టి.మధు, బి.చందు లను కెయుసి. ఇన్స్పెక్టర్ ఎస్.రవి కుమార్  అభినందించారు.