01-11-2025 10:06:50 PM
చిట్యాల (విజయక్రాంతి): చిట్యాల మండలంలోని చిన్నకాపర్తి గ్రామంలో తన తోటి చిన్ననాటి మిత్రుడు రుద్రారపు చందు 23 అక్టోబర్ 2025న అకాల మరణం చెందగా తన తోటి చదువుకున్న పదవ తరగతి బ్యాచ్ 2016-17 మిత్రులు అందరూ కలిసి చదువుకున్న రుద్రారపు చందు జ్ఞాపకార్థంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి సుమారు 20 మందికిపైగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమం భాగంగా తన మిత్రులంతా మాట్లాడుతూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని, మున్ముందు ఇలాంటి కార్యక్రమంలు కొనసాగిస్తామని తెలిపారు.
నలగొండ పట్టణంలో గల అపర్ణ బ్లడ్ బ్యాంక్ అండ్ స్కానింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో దాదాపు 20 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో తుమ్ముకుంట్ల సాయికుమార్, రుద్రారం సాయికుమార్, వరుకుప్పల నవీన్, మెట్టు రాము, ఆవుల శివ, రూపని గణేష్, రూపని పవన్, మాలిగ కిరణ్, రేగులగడ్డ శివ, వినయ్, భాస్కర్, నరేష్, గ్రామ పెద్దలు, యువజన సంఘాలు పాల్గొన్నారు