03-01-2026 12:00:00 AM
అలంపూర్, జనవరి 2: అలంపూర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో యూరియా మరియు ఇతర ఎరువుల తనిఖీ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యవసాయ అధికారి సక్రియ నాయక్ వడ్డేపల్లి మండలంలోని శాంతినగర్ మరియు జులేకల్ కేంద్రాలను పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ...జిల్లాలోని అన్ని మండలాల్లో రైతులకు తగిన మోతాదులో యూరియా అందుబాటులో ఉందని తెలిపారు.
రైతులు ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా తమ అవసరానికి అనుగుణంగా యూరియాను కొనుగోలు చేయవచ్చని సూచించారు. యూరియా కొనుగోలు చేసేందుకు రైతులు తమ ఆధార్ కార్డు మరియు పొలం పాస్బుక్ తీసుకుని కొనుగోలు కేంద్రాలకు వెళ్లి, వివరాలను నమోదు చేసుకున్న తర్వాత యూరియా బస్తాలను పొందవచ్చని జిల్లా అధికారి వివరించారు.