calender_icon.png 25 May, 2025 | 1:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సబ్సిడీ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

24-05-2025 12:56:27 AM

ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ, మే 23,(విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తున్న జీలుగ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు.

శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో ప్రభుత్వం 50శాతం సబ్సిడీపై అందిస్తున్న విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 కిలోల జీలుగ విత్తనాల ధర రూ.4,275 ప్రభుత్వం 50శాతం సబ్సిడీతో రూ.2,137.50కి అందజేస్తోందన్నారు. కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్, జిల్లా వ్యవసాయాధికారి తిరుమల ప్రసాద్, సొసైటీ ఛైర్మన్ ఎర్వల కృష్ణరెడ్డి, నార్ల సురేష్, ఎజాజ్, మోహన్ నాయక్, గంగాధర్, లింగం తదితరులు పాల్గొన్నారు.