calender_icon.png 25 May, 2025 | 11:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెట్రో చార్జీలు 10 శాతం తగ్గింపు

24-05-2025 12:55:52 AM

తగ్గిన ధరలు నేటి నుంచి అమలు 

హైదరాబాద్ సిటీ బ్యూరో, మే 23 (విజయక్రాంతి): హైదరాబాద్ మెట్రో చార్జీలపై పది శాతం రాయితీని కల్పిస్తున్నట్లు ఎల్ అండ్ టీ మెట్రో యాజమాన్యం తెలిపింది. తగ్గించిన చార్జీలు శనివారం నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. ఎల్ అండ్ టీ యాజమాన్యం నష్టాల్లో కొనసాగుతున్నందున గత కొన్ని రోజుల క్రితం 20 శాతం చార్జీలను పెంచిన విషయం తెలిసిందే.

ఆ ధరలపై ప్రయాణికుల నుంచి వ్యతిరేకత రావడంతో 10శాతం రాయితీని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా కనిష్ఠంగా 2 కిలోమీటర్ల లోపు టికెట్ ధర రూ.11, గరిష్ఠంగా రూ.69 వరకు ధరలను నిర్ణయించినట్లు పేర్కొంది.

సవరించిన మెట్రో చార్జీలు

2 కి.మీ.ల వరకు రూ.11

2 నుంచి 4 కి.మీ.ల వరకు రూ.17

4 నుంచి 6 కి.మీ.ల వరకు రూ.28

6 నుంచి 9 కి.మీ.ల వరకు రూ.37

9 నుంచి 12 కి.మీ.ల వరకు రూ.47

12 నుంచి 15 కి.మీ.ల వరకు రూ.51

15 నుంచి 18 కి.మీ.ల వరకు రూ.56

18 నుంచి 21 కి.మీ.ల వరకు రూ.61

21 నుంచి 24 కి.మీ.ల వరకు రూ.65

24 నుంచి ఆపైన కి.మీ.లకు రూ.69