calender_icon.png 25 May, 2025 | 6:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ లబ్ధిదారులకు సాంక్షన్ పత్రాలు అందజేత

24-05-2025 12:58:13 AM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్

కామారెడ్డి, మే 23 (విజయ క్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువా రం  కామారెడ్డి పట్టణ పరిధిలోని లింగా పూర్ విలీన గ్రామంలోని నిరుపేద కుటుంబ యజమానురాలు కుంట్ల వినోద కు ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయగా  కలెక్టర్ భూమి పూజ చేసి ఇంటి నిర్మాణం పనులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మంజూ రైన ఇంటి నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసి ప్రభుత్వం నుండి లబ్ది పొందాలని తెలిపారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలో ఇప్పటివరకు 708 ఇండ్లు మంజూరు కాగా, 74 ఇండ్లకు మార్క్ అవుట్ ఇవ్వడం జరి గిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రెండు దశల్లో 11,153 ఇండ్లు మంజూరయ్యాయని తెలిపారు. ఇందులో  కామారెడ్డి నియోజక వర్గంలో 3206 ఇండ్లు, ఎల్లారెడ్డి నియోజక వర్గంలో 3496, జుక్కల్ నియోజక వర్గంలో 3019, బాన్సువాడ నియోజక వర్గంలో 1432 ఇండ్లు మంజూరు చేయడం జరి గాయని తెలిపారు.

ఇందులో 2250 ఇండ్ల నిర్మాణాలకు లబ్ధిదారులు ముందుకు రాగా ముగ్గుపోయడం జరిగి, నిర్మాణాలు పలు దశల్లో ఉన్నాయని తెలిపారు. ఇందులో 127 ఇండ్లు బేస్మెంట్ స్థాయి వరకు ఇండ్లు నిర్మించుకోగా అందులో ఇప్పటి వరకు 75 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం లక్ష రూపాయల చొప్పున మొదటి విడతలో మంజూరు చేయడం జరిగిందని, ముగ్గురు లెంటిల్ లెవెల్ వరకు నిర్మించుకోగా మరో లక్ష చొప్పున నిధులు మంజూరు చేయడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయ్ పాల్ రెడ్డి, వార్డ్ ఆఫీసర్, గృహ నిర్మాణ శాఖ ఇంజనీర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరం సాగాలి 

కామారెడ్డి జిల్లా కేంద్రంలో పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని, దోమల వ్యాప్తి అరికట్టేందుకు ఫాగింగ్ నిర్వ హించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వార్డ్ నెంబర్ 17, అశోక్ నగర్, స్నేహపురి కాలనీ, తదితర వార్డుల్లో నిర్వ హిస్తున్న పారిశుధ్య పనులను కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కామారెడ్డి పట్టణంలోని అన్ని వార్డుల్లో నిరంతర పారిశుధ్య పనులను చేపట్టాలని మున్సిపల్ అధికారులు, సిబ్బం దికి తెలియజేశారు. వర్షాకాలంలో మురికి కాల్వల్లోని నీరు ప్రవహించే విధంగా చూడాలని, మురికి కాల్వలు, రోడ్లపై నీరు నిలవకుండా ఉండేవిధంగా పనులు చేపట్టా లని అన్నారు. ప్రతీ వార్డ్ ల ఇంచార్జీలు ప్రతీ రోజు వార్డుల్లో పర్యటించి శానిటేషన్ కార్యక్రమాలు పరిశీలించాలని, అధికారులు కూడా పర్యవేక్షించాలని తెలిపారు. పట్టణం లో ఎలాంటి పారిశుధ్య సమస్యలు తలెత్త కుండా శానిటేషన్ కార్యక్రమాలు సజావుగా నిర్వహించాలని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, సహాయ ఇంజనీ రు శంకర్, శానిటరీ ఇన్స్పెక్టర్ పాల్గొన్నారు.