calender_icon.png 24 December, 2025 | 3:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యప్ప స్వామికి అభిషేకం చేసిన మంత్రి శ్రీధర్ బాబు

24-12-2025 12:04:56 PM

కాటారం (మహాదేవపూర్)(విజయక్రాంతి): భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలోని నాగేంద్ర గిరి శ్రీ ఆనంద ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి(Lord Ayyappa) ఆలయంలో బుధవారం అయ్యప్ప స్వామి వారికి వేద పండితుల సమక్షంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babuప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి వారి కృప రాష్ట్ర ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి రైతులకు అధిక లాభాలు రావాలని కోరుకున్నట్టు తెలిపారు.