తుఫాన్‌తో మంథనిలో రైతులకు నష్టం
- వర్షానికి కొట్టుకుపోయిన వరి, తడిసి ముద్దయిన పత్తి ఆందోళనలో రైతులు
-రైతులు ఆందోళన వద్దు, తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు చేస్తుంది. మంత్రి శ్రీధర్ బాబు
మంథని అక్టోబర్ 30 (విజయ క్రాంతి) మోంథా తుఫాన్ తో మంథని లో నిండ రై తులు నిండా మునిగారు. ఈ వర్షానికి చేతికి వచ్చిన వరి. పత్తి పంటలు తడిసి రైతులకు భారీ నష్టం జరిగింది. దీంతో మంథని, ము త్తారం, రామగిరి, కమాన్ పూర్ మండలా ల్లో తీవ్ర నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంథని గోదావరి నది, ముత్తారం మండలంలోని మానేరు నది ఉదృతంగా ప్రవహించడంతో లోతట్టు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నా రు. లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.
తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు ఆందోళన పడవద్దు : ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది మంత్రి శ్రీధర్ బాబు
మోంథా తుఫానుకు పంటలు నష్టపోయి న రైతులు ఆందోళన చెందవద్దని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఒక ప్రక టనలో తెలిపారు. త్వరలోనే నష్టపోయిన పంటలను వ్యవసాయ శాఖ అధికారులకు సర్వే చేసి రైతులకు న్యాయం చేస్తామని మం త్రి తెలిపారు. వాతావరణంలో వచ్చిన మా ర్పుల ద్వారా తుఫాన్ లు సంభవించి రైతు లు పండించిన పంట చేతికి వచ్చే సమ యంలో ఇలాంటి తుఫానుల ద్వారా రైతుల కు తీవ్ర నష్టం జరుగుతుందని మంత్రి ఆవే దన వ్యక్తం చేశారు. ప్రకృతి తో సంభవించిన నష్టానికి రైతులు ఎంతో నష్టపోతున్నారని, ప్రభుత్వం హస్త పోయిన రైతులను గుర్తించి వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుం టామని మంత్రి తెలిపారు.






