భద్రాచలంలో 2కే రన్.. రన్ ఫర్ యూనిటీ
భద్రాచలం, అక్టోబర్ 30, (విజయక్రాంతి) భారతదేశపు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిలా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలమేరకు భద్రాచలం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 6 గంటలకు బ్రిడ్జి సెంటర్ చెక్ పోస్ట్ నుండి జూనియర్ కళాశాల గ్రౌండ్ వరకు రన్ ఫర్ యూనిటీ 2కే రన్ నిర్వహిస్తున్నట్లు భద్రాచలం ఏ ఎస్ పి విక్రాంత్ సింగ్ కుమార్ తెలిపారు.కావున ఈ 2కె రన్ లో యువత అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
అంతేకాకుండా ఉదయం 10 గంటలకు* కూనవరం రోడ్డులోని అన్నపూర్ణ ఫంక్షన్ హాల్ నందుపోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా భద్రాచలం డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ రక్తదాన శిబిరంలో విద్యార్థులు యువత పట్టణ ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఏ ఎస్ పి విక్రాంత్ సింగ్ పిలుపునిచ్చారు.






