31-10-2025 02:01:43 AM
 
							- సీనియర్ న్యాయవాది లుక్క రాజేశం
ముకరంపుర, అక్టోబరు 30 (విజయ క్రాంతి): తనను డైరెక్టర్ గా గెలిపిస్తే బ్యాంకు అభివృద్ధికి కృషి చేస్తానని సీనియర్ న్యాయవాది లుక్క రాజేశం తెలిపారు. నవంబర్ 1న జరగనున్న కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు డైరెక్టర్ స్థానానికి ఆయన పోటీ చేస్తున్నారు. సీరియల్ నెంబర్ 36 ద్రాక్షపండు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని సభ్యు లను కోరారు. ప్రశ్నించే గొంతుకలకు, మేధావులకు బ్యాంకులో చోటు కల్పించాలని ఆయన విజ్ఞప్తిచేశారు.