calender_icon.png 27 July, 2025 | 11:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్‌హెచ్‌పై ఘోర ప్రమాదం

27-07-2025 12:31:06 AM

- ఇద్దరు ఏపీ డీఎస్పీలు మృతి

- యాదాద్రి జిల్లాలో ఘటన

యాదాద్రి భువనగిరి, జూలై 26 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం హైదరాబాద్ జాతీయ రహదారి వద్ద శనివారం తెల్లవారుజామున 5 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు మృతిచెందారు.

ఏపీకి చెందిన డీఎస్పీలు మేక చక్రధర్‌రావు, శాంతారావు శనివారం తెల్లవారుజామున 5 గంటలకు కారులో హైదరాబాదుకు వెళ్తున్నారు. ముందు వెళ్తున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో అదుపుతప్పి వీరి కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. తీవ్రంగా గాయపడ్డ డ్రైవర్, గన్‌మన్లను హైదరాబాద్ ప్రైవేట్  ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు, హైదరాబాదు ట్రాఫిక్ డీసీపీ మనోహర్, చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్‌రెడ్డి పరిశీలించారు.