calender_icon.png 27 July, 2025 | 11:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డెంగ్యూ నివారణకు చర్యలు..

27-07-2025 12:29:11 AM

జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ రఘు ప్రసాద్

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 26 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్‌లో డెంగ్యూ ప్రబలకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని జీహెఎంసీ అదనపు కమిషనర్ (హెల్త్) సీఎన్ రఘు ప్రసాద్ అధికారులను ఆదేశించారు.సనత్‌నగర్‌లో ఇద్దరికి డెంగ్యూ పాజిటివ్ నిర్ధారణ కావడంతో బల్దియా అధికారులు అప్రమత్తమయ్యారు. కమిషనర్ ఆదేశాల మేరకు అదనపు సీఎన్ రఘుప్రసాద్ శనివారం సనత్‌నగర్‌లోని డెంగ్యూ కేసులు నమోదైన కాలనీలో పర్యటించారు.

డెంగ్యూ బాధితులతో మాట్లాడి వారి ఆరో గ్య పరిస్థితులను తెలుసుకున్నారు. డెంగ్యూ కేసులు నమోదైన కాలనీలలో జ్వరపీడితు లు, అనుమానితులకు డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు చేయాలని వైద్యాధికారులు, సిబ్బందికి ఆయన సూచించారు. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, జీహెఎంసీ ఎంటమాలజీ బృందాలు అవగాహన డ్రైవ్‌లు, యాంటీ-లార్వా ఆపరేషన్‌లు చేపట్టాలని అదనపు కమిషనర్ ఆదేశించారు. హెల్త్ జాయింట్ కమిషనర్ శంకర్, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ చం ద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.