30-07-2025 12:19:38 AM
రాంచీ, జూలై 29: జార్ఖండ్ రాష్ట్రంలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమా దం జరిగింది. వేగంగా వెళ్తున్న గ్యాస్ సిలిండర్ల ట్రక్కు బస్సును ఢీకొట్టడంతో 18 మంది మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం దేవ్‌గఢ్ జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున జరిగింది. మోహన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జ మునియా అటవీ ప్రాంతం సమీపంలో క న్వారియాలను తీసుకెళ్తున్న బస్సు..
ఎదురుగా వచ్చిన ట్రక్కును ఢీకొట్టినట్టు పోలీ సులు తెలిపారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని వెల్లడించారు. బా బానగరి దేవ్‌గఢ్‌లో ఉన్న బాబా వైద్యనాథ్ ధామ్‌లో జలాభిషేకం చేసిన తర్వాత భక్తులు బస్సును తీసుకొని దుమ్కాలోని వాసుకినాథ్ ఆలయంలో జలాభిషేక్ చేయడానికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.