calender_icon.png 30 July, 2025 | 3:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుజరాత్‌లో డాక్టర్ డిజిటల్ అరెస్ట్!

30-07-2025 01:15:09 AM

  1.    19 కోట్లు దోచిన సైబర్ నేరగాళ్లు
  2. సూరత్‌లో ఒక నిందితుడి అరెస్ట్.. కోటి స్వాధీనం

గాంధీనగర్, జూలై 29: డిజిటల్ అరెస్ట్ పేరుతో ఒక డాక్టర్ నుంచి సైబ ర్ నేరగాళ్లు రూ.19 కోట్లు కొట్టేసిన ఘటన గుజరాత్‌లోని గాంధీనగర్‌లో చోటుచేసుకుంది. గాంధీనగర్‌కు చెందిన ఒక మహిళా డాక్టర్‌కు గత మార్చి 15న పోలీసులు, లాయర్ అనే పేర్లతో కొందరు కేటుగాళ్లు ఫోన్ చేశా రు. అక్రమాస్తుల కేసులో మీపై మనీలాండరింగ్ కేసు పెడతామని బెది రింపులకు పాల్పడ్డారు.

దీంతో మానసిక ఒత్తిడి, బెదిరింపులకు కుంగిపోయిన ఆ డాక్టర్‌ను మరిం త భయపెట్టారు. ఆ తర్వాత ఆమె దాచుకున్న 19 కో ట్ల  రూపాయలను 35 వేర్వేరు బ్యాంకు అకౌంట్లకు బదిలీ చే యించారు. చివరికి ఆమె బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి కూడా లోన్ తీసుకున్నా రు. ఆ డబ్బు కూడా అకౌంట్లోకి ట్రా న్సర్ చేసుకున్నారు. అయితే కొన్ని రోజుల తర్వాత సైబర్ నేరగాళ్ల నుంచి బెదిరింపు కాల్స్ రా వడం ఆగిపోయాయి.

దీంతో తాను మోసపోయానని గ్రహించిన డాక్టర్ జూలై 16న గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చే శారు. ఫిర్యాదు మేరకు గుజరాత్ సీఐడీ సై బర్ క్రైమ్ యూనిట్ ఈ కేసు దర్యాప్తు ప్రా రంభించింది. ఒక వ్యక్తి నుంచి ఇంత డబ్బు కొట్టేయడం చూస్తే భారత్‌లో అతిపెద్ద డిజిటల్ అరెస్ట్ స్కాం కేసుల్లో ఒకటి కావొచ్చని సీఐడీ అధికారులు పేర్కొన్నారు.

తాజాగా సూరత్‌లో ఒక నిందితుడిని పట్టుకొని అరెస్ట్ చేశారు. అతడి ఖాతా లో ఉన్న రూ. కోటిని స్వాధీనం చేసుకున్నా రు. కేసు లో మిగిలిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని సీఐడీ అధికారులు వెల్లడించారు