calender_icon.png 27 July, 2025 | 9:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్పుకింద బైక్ తీసుకెళ్లిన వ్యక్తిపై తండ్రీ కొడుకుల దాడి..

26-07-2025 11:21:16 PM

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): ఇచ్చిన అప్పును తీర్చమన్నందుకు ఓ వ్యక్తిపై బకాయి పడ్డ వ్యక్తి దాడి చేసి గాయపరిచిన సంఘటన మంచిర్యాల జిల్లా(Mancherial District) కాసిపేట మండలంలో శనివారం చోటుచేసుకుంది. కాసిపేట ఎస్ హెచ్ ఓ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమటిచేను గ్రామానికి చెందిన రామటెంకీ శివరాం, అదే గ్రామానికి చెందిన జాడి రవికి అప్పుగా కొంత నగదును ఇచ్చాడు. అప్పు చెల్లింపులో జాప్యంకావడంతో డబ్బుల గురించి గట్టిగానే అడిగాడు. ఇంతకీ అప్పు చెల్లించకపోయే పోవడంతో విసిగిపోయిన శివరాం, అప్పు కింద జాడి రవి కి చెందిన బైక్ ను గత రెండు రోజుల క్రితం గొడవపడి తీసుకెళ్ళాడు. దీన్నిఅవమానకరంగా భావించి కోపం పెంచుకున్న జాడిరవి అతని కొడుకు జాడి అరవింద్ ఇద్దరూ రామటంకి శివరాంపై కత్తితో దాడి చేశారు. ఈ సంఘటనలో రామటెంకి శివరాం కు స్వల్పంగా కత్తి గాయాలయ్యాయి. బాధితుడి  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ హెచ్ ఓ వెల్లడించారు.