26-07-2025 11:24:53 PM
గజ్వేల్ లో ఎరువుల విక్రయాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హైమావతి..
గజ్వేల్: రైతుల సాగు విస్తీర్ణం మేరకే ఎరువులను డీలర్లు అమ్మాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి(District Collector Haimavati) ఆదేశించారు. శనివారం సాయంత్రం గజ్వేల్ పట్టణంలో తెలంగాణ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్, సెల్ రిజిస్టర్ వెరిఫై చేసి రిజిస్టర్ లో రైతులకు అందించే ఎరువుల వివరాలు రాయడంలో కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. రైతులకు వారి భూమి సాగు చేసే ప్రకారమే ఎరువులు అందించాలని, ఇచ్చిన వారికే అదికంగా ఎరువులు ఇవ్వడం మూలంగా మొత్తానికే ఎరువులు రాని వారికి నష్టం జరుగుతుందన్నారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూప రాణి, ఏఓ తదితరులున్నారు.