calender_icon.png 27 July, 2025 | 9:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్గిల్ విజయంతో ప్రపంచానికి సత్తా చాటిన మన సైనికులు..

26-07-2025 11:18:50 PM

అమర జవాన్ లకు నివాళులర్పించిన ఎమ్మెల్యే పాయల్ ఎమ్మెల్యే..

అదిలాబాద్ (విజయక్రాంతి): భారతదేశ సైనికుల సత్తా ఏంటో పాకిస్తాన్ పై కార్గిల్ యుద్ధ విజయం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పడం జరిగిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్(MLA Payal Shankar) అన్నారు. కార్గిల్ విజయ దివస్ సందర్భంగా శనివారం ఆదిలాబాద్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయ ఆవరణలో గల కార్గిల్ పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద బిజెపి పార్టీ శ్రేణులు, మాజీ సైనికులతో కలిసి అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత 25 ఏళ్ల క్రితం పాకిస్తాన్ సైనికులతో దేశ సైనికులు విరోచితంగా పోరాడి కార్గిల్ విజయాన్ని సాధించి పెట్టారని అన్నారు.

ఈ యుద్ధంలో ఎంతోమంది దేశ సైనికులు అమరులయ్యారని, వారి త్యాగం ఎన్నటికీ వృధా పోదని పేర్కొన్నారు. కుటుంబాలను సైతం లెక్కచేయకుండా దేశ రక్షణకు సైనికులు చేస్తున్న కృషి గర్వకారణమని అన్నారు. ఎప్పుడు శాంతిని కోరుకునే భారతదేశం ప్రపంచమంతా శాంతియుతంగా ఉండాలని ఆకాంక్షిస్తుందన్నారు. మన రక్షణ కోసం అమరులైన వీర సైనికులకు నివాళులర్పించడం ప్రభుత్వం ద్వారానో, లేదా పార్టీలు ద్వారానో కాకుండా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని అన్నారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, పలువురు నాయకులు, మాజీ సైనికులు, ఎన్.సి.సి క్యాడేట్లు పాల్గొన్నారు.