calender_icon.png 11 July, 2025 | 9:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వం అందించే రుణాలు సద్వినియోగం చేసుకోవాలి

11-07-2025 04:38:40 PM

 తెలంగాణ సాంస్కృతిక సారధి జిల్లా టీమ్ లీడర్ పల్లెల లక్ష్మణ్

అనంతగిరి: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అందించే రుణాలను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ సాంస్కృతిక సారధి జిల్లా టీమ్ లీడర్ పల్లెల లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారధి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిర మహిళ శక్తి సంబరాలలో పల్లెల లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి మహిళను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిర మహిళ శక్తి పేరుతో కృషి చేస్తున్నదని, ప్రతి ఒక్క మహిళకు అవకాశం కల్పించడం జరుగుతుందని చెప్పారు. కోటేశ్వరులుగా తీర్చి దిద్దడం జరుగుతుందని తెలిపారు. ప్రతి గ్రూప్ లో సభ్యులు తప్పకుండా ఇన్సూరెన్స్ చేసుకోవడంతో కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోయినప్పుడు బీమాతో దైర్యం కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు.