11-07-2025 05:03:06 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ మున్సిపాలిటీలో ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు వంద రోజుల ప్రణాళికతో ముందుకు వెళ్లాలని మేనేజర్ శ్రీపాద రాజేశ్వర్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో పట్టణంలో 42 వార్డులో 100 రోజుల ప్రణాళిక అభివృద్ధిలో చేపట్టబోయే పనులపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. పారిశుద్ధ్యం వీధిలైట్లు తాగునీటి సరఫరా తదిరపతకాలపై సమీక్ష నిర్వహించి అధికారులకు మార్గం నిర్దేశికం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు సుభాష్ దేవిదాస్ అనిరుద్ పాల్గొన్నారు.