calender_icon.png 12 July, 2025 | 12:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు: ఎస్పీ శరత్ చంద్ర పవార్

11-07-2025 05:00:02 PM

బ్లాక్ స్పాట్ లను పరిశీలించిన జిల్లా ఎస్పీ

నాగార్జునసాగర్,(విజయక్రాంతి): జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, వాహనదారులు విధిగా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని ఎస్పీ శరతచంద్ర పవార్‌ సూచించారు. నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీలోని లో శుక్రవారం సందర్శించి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ లో రోడ్డు ప్రమాదాలకు చెక్​ పెట్టేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది.

ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్​ స్పాట్​గా నమోదు చేసి తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ రూపొందించారు. ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలతో పాటు ప్రమాదాల కంట్రోలింగ్​కు పౌరుల బాధ్యతను వేరుగా అధ్యయనం చేసి ప్లాన్ సిద్ధం చేశారు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఇట్టి కార్యక్రమంలో రోడ్ సేఫ్టీ వింగ్ సిఐ అంజయ్య నేషనల్ హైవే డి ఈ మురళీకృష్ణ , ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుండి ఎస్సీ వీ గీత ఏఈ కే శేఖర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి రాఘవరావు ఫ్డి డిఓ నాగార్జునసాగర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సతీష్ హాలియా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కల్పన నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీను నాయక్ విజయపురి టౌన్ ఎస్సై జి ముత్తయ్య  పాల్గొనడం జరిగింది