calender_icon.png 11 July, 2025 | 7:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా బండి సంజయ్ జన్మదిన వేడుకలు

11-07-2025 04:28:31 PM

చిట్యాల,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పుట్టినరోజు వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో బుర్ర వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ... రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి బండి సంజయ్ చేస్తున్న కృషి ఎనలేనిదని కొనియాడారు. కేంద్ర మంత్రిగా తెలంగాణకు నిధులను తీసుకువచ్చి..తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకు వెళుతున్న ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.