calender_icon.png 11 July, 2025 | 7:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడారం మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామి లక్నవరం రామప్పకు మంథని ఆర్టీసీ బస్సు

11-07-2025 04:33:04 PM

భక్తులు సద్వినియోగం చూసుకోవాలి మంథని ఆర్టీసి డిపో మేనేజర్ శ్రావణ్ కుమార్

మంథని,(విజయక్రాంతి): టీజీ ఎస్ ఆర్ టి సిఎండి  ఆదేశానుసారంగా మంథని డిపో నుండి టూర్ ప్యాకేజీ తయారు చేయబడిందని మంథని ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రావణ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంథని డిపో నుండి మేడారం సమ్మక్క సారక్క దేవాలయం వరకు మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి అలాగే లక్నవరం, రామప్ప దర్శనానికి సూపర్ లగ్జరీ బస్సు ను ఏర్పాటు చేసినట్లు మేనేజర్ తెలియజేశారు.

ఈ  బస్సు ఈనెల 14 న  ఉదయం 5 గంటలకు మంథని నుండి బయలుదేరి మేడారం దర్శనం చేసుకొని అక్కడ దర్శనానంతరం మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి బయలుదేరునని, అక్కడి నుండి నేరుగా లక్నవరం, రామప్ప దేవాలయాలను దర్శించుకుని  అదే రోజు రాత్రి 8  గంటలకు మంథని కి చేరుకుంటోందని, ఈ ప్రయాణానికి గాను బస్ చార్జీలు పెద్దలకు రూ.800, పిల్లలకు రూ. 500 గా నిర్ణయించినట్లు డిపో మేనేజర్  పేర్కొన్నారు. కావున ఈ  అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకవాలని కోరారు. ఈ బస్సు బుకింగ్ వివరాల కొరకు 9959225923,9948671514 నెంబర్ లో సంప్రదించగలరని, టికెట్స్ బుకింగ్ కొరకు phone pay, google pay సౌకర్యం కూడా ఉందని మేనేజర్ తెలిపారు.