calender_icon.png 11 July, 2025 | 9:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేర చరిత్ర కలిగిన వ్యక్తి కౌశిక్ రెడ్డి

11-07-2025 04:43:06 PM

బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఒక ఇల్లు కూడా ఇవ్వకుండా ధర్నాల

 హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ బాబు

హుజురాబాద్,(విజయక్రాంతి): కౌశిక్ రెడ్డి నేర చరిత్ర కలిగిన వ్యక్తి అని కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ ఓడితల ప్రణవ్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నడవడిక  సరిగా లేకపోవడంతో పలుచోట్ల కేసు నమోదు అయ్యాయని, డబ్బులు ఇవ్వమని వ్యాపారులను బెదిరిస్తే కేసులు పెట్టారన్నారు. కౌశిక్ రెడ్డి ఆగడాలపై ఎన్నో కేసు నమోదయాయని కౌశిక్ రెడ్డి చరిత్ర మొత్తం కేసు సమయమని ఎదవ చేశారు.

బిఆర్ఎస్ ప్రభుత్వం 10ఏళ్లలో ఒక నిరుపేద కూడా ఇల్లు మంజూరు చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారన్నారు. ఇందిరమ్మ ఇండ్ల వద్దకు పోయి ధర్నాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ధర్నాలు చేసే హక్కు బిఆర్ఎస్ పార్టీకి లేదని వేలకోట్ల ప్రజాధనం వృధా చేసిన ఘనత కేసిఆర్ది అని అన్నారు. బిఆర్ఎస్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూములు ఒక్క నిరుపేద కూడా అందించలేదని ప్రజాధనం వృధా చేశారన్నారు. సుమారు 150 cmrf చెక్కులు అందజేశామని హుజురాబాద్ మండలంలో 16 లక్షలకు పైచిలుక విలువ గల 39 చెక్కులు పంపిణీ చేశామని,

 హుజురాబాద్ ఎమ్మెల్యే చెల్లనిచెక్కులు ఇచ్చి లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ప్రజల యోగక్షేమాలు పట్టించుకోకుండా సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్నాడని ఎద్దేవ చేశారు. హుజురాబాద్ నియోజకవర్గం లో సుమారు 3,500 కొత్త రేషన్ కార్డులు ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం పదివేల పాలనలో ఒక్క నిరుపేద కూడా రేషన్ కార్డు అందివ్వలేదని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ క్యాబినెట్లో ఆమోదించామన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.