11-07-2025 04:55:13 PM
నల్గొండ: మైనార్టీలకు అప్పటి ప్రభుత్వం ఇచ్చిన 5 గంటల భూమిని మైనార్టీలకు ఇవ్వాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న అన్నారు. శుక్రవారం చండూరు మండల కేంద్రంలో మండల పరిధిలోనినే ర్మట గ్రామానికి చెందిన మైనార్టీలతో కలిసి గ్రామస్తులు చండూరు ఆర్డీవో శ్రీదేవికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత 60,70 సంవత్సరాల నుండి మైనార్టీల పేరుమీద ఐదు గుంటల భూమి అప్పటి ప్రభుత్వం ఇచ్చిందని, కానీ కొంతమంది ఆ భూమికి వారికి రాకుండా రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మైనార్టీలకు ఆశుర్ఖాన్ గ్రామకంఠం పేరుమీద ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ ముస్లింలు, హిందువులు కలిసి మొహర్రం పండుగ చేసుకుంటున్నారని, కొంతమంది ఓర్వలేక ఈ భూమిపై రాజకీయాలు చేయడం సరైనది కాదు అని ఆయన అన్నారు. అనంతరం ఈ విషయంపై ఆర్డిఓ గారు స్పందించి వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి న్యాయం చేయడం పట్ల గ్రామస్తులు, మైనార్టీలు సంతోష వ్యక్తం చేశారు.