23 June, 2026 | 1:23 AM

బౌద్ధ వారసత్వ సంపదను పరిరక్షిస్తాం

23-06-2026 12:38 AM
  1. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
  2. సూర్యాపేట జిల్లా ఫణిగిరి, గాజులబండ బౌద్ధ కట్టడాల పరిరక్షణ పనులకు శంకుస్థాపన
  3. భువనగిరి కోటలో అభివృద్ధి పనుల పరిశీలన 
  4. సోమేశ్వర ఆలయ అభివృద్ధికి రూ.5 కోట్లు మంజూరు 

సూర్యాపేట/తుంగతుర్తి/ఆలేరు, జూన్ 22 (విజయక్రాంతి): తెలంగాణలోని బౌద్ధ వారసత్వ సంపద పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరి గ్రామంలో ఫణిగిరి, గాజులబండ బౌద్ధ క్షేత్రాల్లో పరిరక్షణ, పునరుద్ధరణ పనులకు ఎమ్మె ల్యే మందుల సామేల్ తో కలిసి మంత్రి సోమవారం శంకుస్థాపన చేశారు.

తెలంగాణ జెన్కో (వైటీపీఎస్) సీఎస్‌ఆర్ నిధులతో ఫణిగిరి బౌద్ధ కట్టడాల పరిరక్షణకు రూ.1.60 కోట్లు, గాజులబం డ కట్టడాల సంరక్షణకు రూ.23 లక్షలు నిధులు మంజూరు చేశారు. ఫణిగిరిలో మ్యూజియంను సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన  సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఫణిగిరి దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన బౌద్ధ వారసత్వ కేంద్రాల్లో ఒకటని  పేర్కొన్నారు.

ఫణిగిరి, గాజులబండ వంటి బౌద్ధ క్షేత్రాల అభివృద్ధి ద్వారా తెలంగాణను జాతీయ, అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక పటంలో మరింత ప్రముఖంగా నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎమ్మెల్యే  మందుల సామేల్ వినతి మేరకు ఫణిగిరి బౌద్ధ క్షేత్ర సమగ్ర అభివృద్ధికి రూ.5 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం భువనగిరి కోటలో జరుగుతున్న అభివృద్ధి పనులను, ఆలేరు మండలం కొలనుపాకలోని ప్రాచీన సోమేశ్వర ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించి, సమీక్ష నిర్వహించారు

. భువనగిరి కిల్లా పైకి రూట్ వే నిర్మించే స్థలాన్ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు.  ఫోర్టు రిస్టోరేషన్ చేసి చరిత్ర తెలిసేలా మ్యూజియం ఏర్పాటు చేస్తామన్నారు. గంటకు 300 మంది ప్రయాణికులు చ్‌పయాణికులు పైకి వెళ్లేలా రోప్ వే ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. యాదగిరిగుట్ట, భువనగిరి చ్‌వనగిరి, కొలనుపాక సోమేశ్వర ఆలయం, స్వర్ణగిరిలను కలుపుతూ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన సోమేశ్వర ఆలయ అభివృద్ధికి రూ.5 కోట్లు మంజూరి చేశారు.