12 May, 2026 | 11:31 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

విద్యార్థుల ఖాతాల్లోనే ఫీజులు జమ.. ప్రభుత్వ నిర్ణయం– అభినందనీయం

01-05-2026 08:10 PM

బీసీ సంఘం నేత రాజ్ కుమార్

తాండూరు,(విజయక్రాంతి): విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోనే ఫీజు రియంబర్స్మెంట్ జమ చేయాలన్న ప్రభుత్వాన్ని నిర్ణయాన్ని వికారాబాద్ జిల్లా తాండూరు బీసీ సంఘం నేత కందుకూరి రాజ్ కుమార్ స్వాగతించారు. శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ విద్యార్థులకు, కాలేజీ యాజమాన్యానికి రెండింటికీ మేలు జరుగుతుందని.. విద్యార్థులకు నేరుగా లబ్ధి చేరడమే కాకుండా, కాలేజీ యాజమాన్యాలకు కూడా సకాలంలో ఫీజులు అందే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇప్పటివరకు మధ్యవర్తిత్వం, ఆలస్యం వంటి సమస్యలు ఉండేవని, ఈ కొత్త విధానం వల్ల అవి గణనీయంగా తగ్గుతాయని . దీంతో విద్యా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు.