calender_icon.png 11 July, 2025 | 7:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫీజుల పంచాయితీ మళ్లీ మొదటికి!

11-07-2025 12:35:03 AM

  1. కొత్త ఫీజులు వసూలు చేసుకోవచ్చని రెండు కాలేజీలకు హైకోర్టు అనుమతి
  2. కోర్టుకెళ్లిన మరికొన్ని ఇంజినీరింగ్ కాలేజీలు
  3. గందరగోళంలో విద్యార్థులు

హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): ఫీజుల పంచాయితీ మళ్లీ మొదటికొచ్చింది.తాజాగా రెండు ఇంజినీరింగ్ కాలేజీలకు కొత్త ఫీజులు వసూలు చేసుకోవచ్చని హైకోర్టు అనుమతులిచ్చింది. ఫీజుల అంశం ఎటూ తేలకపోవడంతో విద్యార్థుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. ప్రస్తుత విద్యాసంవత్సరం 2025 ఇంజినీరింగ్‌తోపాటు ఫార్మసీ, ఎం టెక్, ఎంఫార్మసీ తదితర ఉన్నత విద్యా కోర్సులకు పాత ఫీజులే అమల్లో ఉంటాయని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

దాని ప్రకారంగానే ఎప్‌సెట్ కౌన్సెలింగ్‌ను అధికారులు చేపడు తున్నారు. విద్యార్థులకు కూడా తమకు అనుకూలంగా ఫీజులు ఉన్న కాలేజీల్లో వెబ్ ఆప్షన్లు పెట్టు కుంటున్నారు. ఈక్రమంలో టీఏఎఫ్‌ఆర్‌సీ నిర్ధారించిన కొత్త ఫీజు ల వసూలుకు అనుమతులించాలని కాలేజీలు కోర్టు ను ఆశ్రయించడంతో విద్యార్థుల్లో గందరగోళం ఏర్పడింది.

2025-28 బ్లాక్ పీరియడ్(మూడేండ్లు)కు గానూ ఫీజుల సవరణకు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) కాలేజీల నుంచి ప్రతిపాదనలను స్వీకరించింది. కాలేజీల వారీగా ప్రత్యక్ష విచారణ చేపట్టింది. ఆయా కాలేజీ లు ఇచ్చిన నివేదికలను పరిశీలించి ఫీజులను కూడా ఖరారు చేసింది.

అయితే ఆ ఖరారు చేసిన ఫీజులను అధికారికంగా ధ్రువీకరించాల్సిన సమయంలోరాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త విద్యాసంవత్సరానికి ఫీజుల సవరణకు బ్రేకులు వేసింది. టీఏఎఫ్‌ఆర్‌సీ ప్రభుత్వానికి ప్రతిపాదించిన కొత్త, పాత ఫీజులకు భారీగా వ్యత్యాసం ఉండడంతో సవరణను నిలిపివేసింది. 

ఒప్పుకోని కాలేజీలు..

ఫీజుల సవరణను ప్రభుత్వం బ్రేకులు వేయడంతో కొన్ని కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. వాటిలో సీబీఐటీ, ఎంజీఐటీ కాలేజీలకు కోర్టు కొత్త ఫీజులను వసూలు చేసుకోవచ్చని అనుమతినిచ్చిన ట్లు అధికారులు తెలిపారు.  సీబీఐటీకు ప్రతిపాదించిన ఫీజు దాదాపు రూ.2.23 లక్షలుకాగా, ఎంజీఐటీ ఫీజు దాదాపు రూ.2లక్షలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఈ ఫీజులనే ఈ విద్యాసంవత్సరం వసూ లు చేసుకోవచ్చని కోర్టు ఆయా కాలేజీలకు అనుమతులిచ్చినట్లు చెబుతున్నారు. దీంతోపాటు మరో 11 కాలేజీలు కూడా కోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. ఫీజుల విషయంలో కాలేజీలకు అనుకూలం గా ఆదేశాలు రావడంతో మిగతా కాలేజీలు కూడా కోర్టును ఆశ్రయించి కొత్త ఫీజులను పెంచాలని కోరే అవకాశం లేకపోలేదు.  

కౌన్సెలింగ్ మొదటి నుంచి గందరగోళమే..

ఎప్‌సెట్ కౌన్సిలింగ్‌పై మొదటి నుంచీ గందరగోళమే నడుస్తోంది. ప్రభుత్వమేమో పాత ఫీజులంటో ంది.. కాలేజీలేమో కోర్టును ఆశ్రయించి కొత్త ఫీజులకు అనుమతులు తెచ్చుకుంటున్న నేపథ్యంలో ఎప్‌సెట్ కౌన్సెలింగ్‌పై విద్యార్థుల్లో గందరగోళం ఏర్పడుతోంది. కౌన్సెలింగ్ సాఫీగా జరుగుతుందా? నిలిచిపోతుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు ఆప్షన్లు పెట్టుకునేందుకు గురు వారంతో గడువు ముగిసింది.

ఈనెల 18న ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయిస్తారు. ఇప్పటికే విద్యార్థులు కాలేజీలను ఎంచుకున్నా రు.  పాత ఫీజులే ఉం టాయని ప్రకటించడంతో చాలా మంది విద్యార్థులు ఫీజులను సరిచూసుకొని తమకు నచ్చిన కాలే జీను ఇప్పటికే ఎంచుకున్నారు. ఇప్పడు మళ్లీ కొత్త ఫీజులను వసూలు చేసుకోవచ్చనడంతో మిగిలిన ఫీ జులను విద్యార్థులు చెల్లించాల్సి ఉంటుంది.

అయితే ఫీజుల ఏఏ కాలేజీల్లో పెరిగాయనే విషయా న్ని అధికారులు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తే విద్యార్థులకు స్పష్టత వస్తుంది. మరికొన్ని కాలేజీల్లో ఫీజులు పెరిగే అవకాశముండడంతో వెబ్‌ఆప్షన్లు నమోదు గడువును అధికారులు పెంచే అవకాశముంది.