గాధిర్యాల్ వాలీబాల్ జట్టుకు ఘన సన్మానం
మహమ్మదాబాద్: మండల పరిధిలోని గాదిర్యాల గ్రామంలో మహబూబ్‌నగర్‌లో జరిగిన 18వ ఈషా గ్రామోత్సవం అంతర్‌జిల్లా వాలీబాల్ టోర్నమెంట్‌లో ద్వితీయ స్థానం సాధించిన గాధిర్యాల్ గ్రామ వాలీబాల్ జట్టును సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ టీ.మాణిక్యమ్మ, పంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి మాట్లాడుతూ... యువత క్రీడలతో పాటు విద్యలోనూ ప్రతిభ చాటుతూ గ్రామానికి మరింత గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం క్రీడాకారులతో పాటు పారిశుద్ధ్య కార్మికురాలిని శాలువాలతో సత్కరించి అభినందించారు.కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ అధ్యక్షుడు జి. చంద్రయ్య, మాజీ అధ్యక్షుడు జి. అనంతయ్య, తలారి రాములు, ఇరువింటి అంజలయ్య, రాములు, హర్జన్ చిన్నయ్య, పాఠశాల హెడ్‌మాస్టర్ రాములు, పారిశుద్ధ్య కార్మికులు, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు






