4 August, 2026 | 11:58 AM

ఇసుక అక్రమ రవాణా అరికట్టాలి

04-08-2026 09:56 AM

రాజాపూర్: మండల కేంద్రంతో పాటు మండలంలో ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని రాజపూర్ గ్రామ సర్పంచ్ రామకృష్ణ ఉప సర్పంచ్ రేష్మ నజీమ్ సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మండలంలో ఇసుక అక్రమ రవాణా వల్ల భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోయాయని తెలిపారు.

అలాగే మండలంలో నిత్యం పదుల సంఖ్యలో ఇసుక టిప్పర్ లు వెళ్లడం వల్ల రోడ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయని తెలిపారు. రోడ్లపై ఏర్పడిన గుంతల వల్ల ప్రజలు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని అన్నారు. రెవెన్యూ అధికారులు పోలీసులు సంయుక్తంగా పనిచేసే ఇసుక అక్రమ రవాణాన్ని అడ్డుకోవాలని ఈ సందర్భంగా కోరారు.