15-12-2025 12:22:21 AM
కామారెడ్డి , డిసెంబర్ 14 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు, ఉప సర్పంచ్లకు, వార్డ్ మెంబర్లకు, టిపిసిసి రాష్ట్ర జనరల్ కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా ఆదివారం సన్మానం చేశారు. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం, నిరంతరం కాంగ్రెస్ కార్యకర్తలు, పనిచేసినందుకు గాను కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో,దోమకొండ సర్పంచ్, ఐరేని నరసయ్య, బిబిపేట్ సర్పంచ్ ఏదుల్ల స్వాదిక సాయినాథ్,రాజంపేట ఉప సర్పంచ్ ఇమ్రాన్ అలీ , వార్డ్ మెంబర్లు,తాజా మాజీ కౌన్సిలర్లు, శ్రీనివాస్, నిమ్మ విజయకుమార్ రెడ్డి, జూలూరి సుధాకర్,మామిళ్ళ రమేష్,పిడుగు సాయిబాబా, సలీం,గడ్డమీది మహేష్, నర్సుల మహేష్, మున్ను, శశి, గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.