15-12-2025 12:21:08 AM
పది స్థానాలకే పరిమితం
వార్డు స్థానాల్లోనూ ఘోరంగా ఓటమి చవిచూసిన హస్తం
నాగర్ కర్నూల్ డిసెంబర్ 14 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ నియోజకవర్గం లోని రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా వైఫల్యం చెందింది. గెలిచే గ్రామాలు అంటుంచి కనీ సం వార్డు స్థానాలను కూడా చేజిక్కించుకోవడంలో ఘోరంగా విఫలమైంది. అభ్యర్థుల ఎంపిక, వారికి అందించాల్సిన సహకారం, రెబల్స్ ప్రమాదాన్ని నిలువరించుకోకపోవడం వంటి తప్పిదాల ఫలితంగా అత్యధిక స్థానాల్లో ఓటమి చవిచూడక తప్పలేదు.
నాగర్ కర్నూల్ మండలంలో రెండో విడత పంచాయితీ ఎన్నికల పోరులో అధికార కాంగ్రెస్‌తో బీఆర్‌ఎస్ గట్టిగా తలపడ్డాయి. నాగర్ కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థుల గెలుపు అంశంలో నిర్లక్ష్యమే కనిపించింది. నాగర్‌కర్నూ ల్ మండ లంలోని 18 గ్రామ పంచాయతీలు ఉండగా కాం గ్రెస్ 10 గ్రాములు విజయం సాధించగా ఆరు గ్రామపంచాయతీలో టిఆర్‌ఎస్ రెండు గ్రామపంచా యతీలో ఉమ్మడి పార్టీల అభ్యర్థులు విజయం సాధించారు.
వనపట్ల గ్రామంలోని ఉమ్మడి పార్టీల అభ్యర్థిగా బరిలో దిగిన కుమ్మరి వాసుదేవుడు తమ సమీప కాంగ్రెస్ అభ్యర్థి అయిన ఎల్లయ్యపై 200 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వెంకటాపూర్లో కాంగ్రెస్ అభ్యర్థి నరసింహారెడ్డి 80 ఓట్లతో విజయం సాధించగా, నర్సాయిపల్లిలో ఉమ్మడి పార్టీల అభ్య ర్థి నల్లగంటి రాములు 244 ఓట్లతో గెలుపొందాడు. కాంగ్రెస్ అభ్యర్థి మేకల మణెమ్మ బాలపీరు భాగ్యలక్ష్మిపై 283 ఓట్లతో గెలిచారు. గన్యాగుల గ్రామంలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి ఎద్దుల గోపాల్ రెడ్డిపై కృష్ణయ్య 270 ఓట్ల తేడాతో గెలుపొందారు.
అవురాసుపల్లిలో కాం గ్రెస్ అభ్యర్థి చీమల మమతపై టిఆర్‌ఎస్ అభ్యర్థి గంగసాని శ్రీల త విజయం సాదించారు. మల్కాపూర్ గ్రామం బీఆర్‌ఎస్ అభ్య ర్థి రాముడు కాంగ్రెస్ అభ్యర్థి జంగమ్మ పై 186 ఓట్ల తేడాతో గెలుపొందారు. చందుపట్లలో టిఆర్‌ఎస్ అభ్యర్థి సూర్య తిరుపతి గౌడ్ పై కాంగ్రెస్ అభ్యర్థి మడ్డి తిరుపతయ్య గౌడ్ విజయం సాదించారు. పుల్జాలలో బిఆర్ అభ్యర్థి గోరంట్ల పూజవతి కాంగ్రెస్ అభ్యర్థి భీమమ్మపై 107 ఓట్ల తేడాతో గెలిచారు. నల్లవల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి అంతారం వెంకటస్వామి బుసిరెడ్డి మోహన్ రెడ్డిపై 17 ఓట్ల తేడాతో గెలుపొందారు.
శ్రీపురంలో కాంగ్రెస్ అభ్యర్థి కూచకుల్ల గీత బిఆర్‌ఎస్ అభ్యర్థి గుంటి నారమ్మపై 372 ఓట్ల తేడాతో గెలుపొందారు. పెద్దముదునూరులో కాంగ్రెస్ అభ్యర్థి సురభి ఊర్మిలమ్మ బిఆర్‌ఎస్ అభ్యర్థి వరలక్ష్మిపై 365 ఓట్ల తేడాతో గెలుపొందారు. గగ్గలపల్లిలో బిఆర్‌ఎస్ అభ్యర్థి కుప్పే ఉషరాణి కాంగ్రెస్ అభ్యర్థి బ్యాగరి నాగేశ్వరిపై 326 ఓట్ల తేడాతో గెలుపొందారు. గుడిపల్లిలో బిఆర్‌ఎస్ అభ్యర్థి నరసింహారెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి కోట్ల అశోక్ రెడ్డి 248 ఓట్ల తేడాతో గెలుపొందారు. కుమ్మేర గ్రామం కాంగ్రెస్ అభ్యర్థి తుర్కారం రెడ్డి బిఆర్‌ఎస్ అభ్యర్థి తిరుపతిరెడ్డిపై 248 ఓట్ల తేడాతో గెలుపొందారు.
మంతటిలో టిఆర్‌ఎస్ అభ్యర్థి సూగూరు శ్రీనివాసులు కాంగ్రెస్ అభ్యర్థి సలేశ్వరంపై 698 ఓట్ల తేడాతో గెలుపొందారు. బొందలపళ్లిలో ఇండిపెండెంట్ అభ్య ర్థి పాలడుగు సుగుణమ్మ కాంగ్రెస్ అభ్యర్థి బంగారమ్మపై 64 ఓట్ల తేడాతో గెలుపొందా రు. తూడుకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి సత్తవరపు లక్ష్మి కరుణాకర్ రెడ్డి టిఆర్‌ఎస్ అభ్యర్థి సత్తవరం విమలపై 225 ఓట్ల తేడాతో గెలుపొందారు.