28 August, 2026 | 1:55 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

ఎరువుల ధరలను తక్షణమే నియంత్రించాలి

23-06-2026 12:00 AM

అశ్వారావుపేట, జూన్ 22 (విజయ క్రాంతి): రైతులు వినియోగించే ఎరువుల ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశా రు. సిపిఐ ,అఖిల భారత కిసాన్ సంఘం పిలుపులో భాగంగా  సోమవారం అశ్వరావుపేట  లోని తహసిల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ అశ్వరావుపేట మండల సమితి, రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా లో పెంచిన ఎరువుల ధరలతో రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, ధరలను వెంటనే నియంత్రిం చాలని, రైతు బంధును ఓకే దఫాగా జూన్ 30 తారీకు  కల్లా రైతుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు.

యూరియా యాప్ రద్దు చేయాలని, నకిలీ విత్తనాలు, పుగుల మందులు అమ్మే దళారీలపై పి.డి యాక్ట్ నమోదు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

వివిధ డిమాండ్లతో కూడిన మెమోరాండంను అశ్వరావుపేట తహసీల్దార్ గారికి సమర్పించడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి తమ డిమాండ్లను పై అధికారుల దృష్టికి తీసుకువెళతామని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సయ్యద్ సలీం తెలియజేసినారు.  సిపిఐ జిల్లా సమితి సభ్యులు గన్నిన రామకృష్ణ,రైతు సంఘం నాయకులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, సిపిఐ కార్యకర్తలు పాల్గొన్నారు.